రామతీర్థంలో వైభవంగా లక్ష కుంకుమార్చన

VZM: జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అర్చకులు శుక్రవారం వైభవంగా జరిపించారు. ముందుగా మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.