గండి పూడ్చివేత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
AKP: రాంబిల్లి మండలం రాజాల వద్ద శారదా నదికి పడిన గండి పూడ్చివేత పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 50% పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.