పుష్పగిరిలో అద్భుత కుడ్య శిల్పం...

పుష్పగిరిలో అద్భుత కుడ్య శిల్పం...

KDP: వల్లూరు మండలం పుష్పగిరిలోని చెన్నకేశవ ఆలయ గోడపై వామన, నరసింహ, వరాహ స్వాముల అరుదైన కుడ్య శిల్పాన్ని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ కనుగొన్నారు. దశావతారాల్లోని మూడు రూపాలను ఒకే చోట సూక్ష్మంగా చెక్కడం ఆనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనమని ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ శిల్పం ఎంతో విశిష్టమైనదని ఆయన కొనియాడారు.