బస్టాండ్ నిర్మాణం కోసం వినతిపత్రం అందజేత

ప్రకాశం: దోర్నాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో APSRTC వారి ఆధ్వర్యంలో బస్టాండ్‌ని త్వరగతిన నిర్మించాలని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబుకి వివిధ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఎరిక్షన్ బాబును కలిసిన వారిలో మాజీ ఎంపీపీ ప్రభాకర్, మల్లారెడ్డి,జమ్మిదోర్నాల మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.