నిరూపిస్తే రాజీనామా చేస్తా: అఖిలప్రియ

నిరూపిస్తే రాజీనామా చేస్తా: అఖిలప్రియ

AP: నంద్యాల జిల్లాలోని అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని MLA అఖిలప్రియ అన్నారు. అహోబిలంలో బి ట్యాక్స్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2006 నుంచి అక్కడ సర్పంచ్‌గా గంగుల అనుచరులే కొనసాగుతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో YCP వారే అక్రమాలకు పాల్పడ్డారని..అక్కడి అక్రమ కట్టడాలను కూల్చేందుకు సిద్ధమన్నారు.