రహదారి గుంతలమయం.. ప్రయాణం కష్టమే..!
VKB: పెద్దముల్ నుంచి తాండూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో దారుణంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రోడ్డంతా భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.