'సక్రమంగా గ్యాస్ సరఫరా చేయాలి'

'సక్రమంగా గ్యాస్ సరఫరా చేయాలి'

AKP: నర్సీపట్నంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు బుధవారం ఆరోపించారు. గ్యాస్ బుక్ చేసిన 15 నుంచి 20 రోజులు అయినా సరఫరా కాక ప్రజలు, హోటళ్లు, టీ దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా పంపిణీలో ఆలస్యం జరుగుతోందని, డిమాండ్‌కు అనుగుణంగా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలన్నారు.