VIDEO: అకేరు వాగులో మృత కోళ్లు.. కల్లెడలో కలకలం

VIDEO: అకేరు వాగులో మృత కోళ్లు.. కల్లెడలో కలకలం

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు అకేరు వాగు కొత్త బ్రిడ్జి నుంచి వందలాది మృత కోళ్లను వాగు నీటిలో పడవేశారు. దీంతో దుర్వాసన వ్యాపించి నీరు కలుషితమవుతుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.