సమయపాలన తప్పనిసరి: డీఎంహెచ్ఓ శ్రీరామ్.!

సమయపాలన తప్పనిసరి: డీఎంహెచ్ఓ శ్రీరామ్.!

MDK: పాపన్నపేట ప్రాథమిక వైద్యా ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రికార్డులు, ల్యాబ్, మందులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.