ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ ఖయూమ్ అనే రోగికి వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహను సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 65,000 రూపాయల ఎల్ఎసీని మంజూరు చేశారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.