వైసీపీ ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే శ్రావణి
ATP: శింగనమల శ్రీ దుర్గా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలపై తలెత్తిన వివాదంపై విచారణ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయనే వైసీపీ నేతల ఆరోపణలను ఆమె ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆలయం అభివృద్ధి చెందిందని, వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.