మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీమల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జునస్వామి, గొల్ల కేతమ్మ, బలిజ మేడాలమ్మలను భక్తులు దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, ఒగ్గుపూజలతో పాటు పట్నం వేసి బోనం సమర్పించారు. అనంతరం అర్చకులు మధుకర్ శర్మ గోత్రనామాలతో పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.