అంధుల పట్ల చులకన భావం వద్దు: MLA
NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం నగర శివారులోని తారకరామానగర్ కాలనీలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంధులను చులకనగా చూసే సామాజిక దృక్పథాన్ని తొలగిస్తే, వారిలో దాగివున్న నైపుణ్యం బయటకు వస్తుందన్నారు.