VIDEO: భీమగల్‌లో ట్రైనింగ్ IAS కరోలిన్ పర్యటన
NZB: జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఐఏఎస్ కరోలిన్ చింగ్డియన్మావి భీమగల్ మున్సిపాలిటీలో మూడు వారాలపాటు పర్యటిస్తారని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. శిక్షణలో భాగంగా మంగళవారం మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న లింబాద్రిగుట్ట అర్బన్ ఫారెస్ట్ పార్క్ పరిశీలించారు.