నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
GNTR: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారని తెనాలి టీడీపీ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కార్యక్రమంలో పాల్గొని, తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించవచ్చన్నారు.