అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన నల్లమల క్రీడాకారుడు

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన నల్లమల క్రీడాకారుడు

NGKL: ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ జట్టులో అచ్చంపేట మండలం దేవులతండాకు చెందిన సభావత్ బాబు నాయక్ ప్రాతినిధ్యం వహించారు. మారుమూల గిరిజన గ్రామం నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై రాణించడం పట్ల గ్రామస్థులు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.