రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే
కోనసీమ: తుఫాన్ ముప్పు నుంచి తప్పించుకున్నామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. బుధవారం కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపేటలో రైతన్నలు పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. వాటిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.