పాఠశాల ముందస్తు బోనాల పండుగ..

పాఠశాల ముందస్తు బోనాల పండుగ..

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కాకతీయ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి బోనం ఎత్తుకుని పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు పోతరాజు వేషధారణతో విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.