భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
SRD: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా పటాన్‌చెరు, బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయ EO శశిధర్ గుప్త మాట్లాడుతూ.. ప్రాతఃకాలం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకొని పవిత్ర కార్తీక వత్తులను వెలిగించి, క్యూలైన్లను పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారని అన్నారు.