బంట్వారం ఈసారైనా యూరియా అందేనా!

బంట్వారం  ఈసారైనా యూరియా అందేనా!

VKB: కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. ఉదయం నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నామని, అందుబాటులో యూరియా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే మండలంలోని రైతులందరికీ యూరియాను అందుబాటులో ఉంచి అందించాలని వారు కోరారు.