అగ్రికల్చర్ వర్సిటీలో.. కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు
RR: రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించినట్లు వైస్ ఛాన్సిలర్ జానయ్య తెలిపారు. సామాజిక న్యాయం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతు కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు.