6నుంచి టెన్త్ పరీక్షల మూల్యాంకనం
సత్యసాయి: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో క్రిష్ణప్ప, పరీక్షల విభాగ ఏడీ లాజర్ తెలిపారు. కొత్త చెరువు జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలోని 35 గదుల్లో మూల్యాంకానికి అవసరమైన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా 400 ట్యాబ్‌లను సిద్దం చేశామని పేర్కొన్నారు.