ఘనంగా RSS శత వసంత వేడుకలు

ఘనంగా RSS శత వసంత వేడుకలు

CTR: విజయదశమి పర్వదినం సందర్భంగా పుంగనూరులో RSS శత వసంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని స్థానిక జడ్పీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. మొదట భారత మత, RSS ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధ్వజ ప్రణామం చేశారు. అనంతరం పలువురు RSS స్థాపన ముఖ్య ఉద్దేశం, నిబంధనల గురించి వివరించారు.