కరెంట్ షాక్‌తో కౌలురైతు మృతి
E.G: విద్యుత్ షాక్ కు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు హైవే రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పొలంలో కరెంటు తీగలు తెగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు. మృతుడు పసివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీను(60)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.