కల్తీ పాలపై కట్టుదిట్టమైన చర్యలు
తూ.గో జిల్లాలో కల్తీ పాల ఘటనల నేపథ్యంలో పశు సంవర్ధక శాఖ & ఫుడ్ సేఫ్టీ విభాగాలు సంయుక్తంగా విస్తృత చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి టి.శ్రీనివాస రావు, ఫుడ్ సేఫ్టీ అధికారి కె.సుప్రియ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 705 పాల నమూనాలను పరీక్షించగా, అందులో 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.