తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ పరీక్షకు హజరు

తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ పరీక్షకు హజరు

VSP: తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ పదో తరగతి పరీక్షలకు అనుపమ హాజరైంది. ఆదివారం బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి రామకృష్ణ కూతురు కళ్ల ఎదుటే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షలకు గాజువాక హై‌స్కూల్లో హాజరైంది. చదువుకొని పైకి రావాలని తరచూ నాన్న చెప్పేవారని ఆమె వెల్లడించింది.