గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు అరెస్ట్
NZB: యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని మోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ రూరల్ CI సురేష్ కుమార్ నిన్న తెలిపారు. కంజర గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్క సమాచారం మేరకు మోపాల్ ఎస్సై సుస్మిత సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారన్నారు.