బస్సులలో పెరిగిన రద్దీ.. 'అదనపు బస్సులు నడపాలి'

బస్సులలో పెరిగిన రద్దీ.. 'అదనపు బస్సులు నడపాలి'

ASF: తిర్యాణి మండలంలో RTC బస్సులలో రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ 2 బస్సులు మాత్రమే ఉండటంతో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అటవీ ప్రాంతం, ఎత్తయిన ఘాట్ రోడ్లలో ఇలాంటి ప్రయాణం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సును నడపాలని మండల ప్రజలు కోరుతున్నారు.