గణేశ్ నిమజ్జనంపై ఎస్సై సూచనలు

MNCL: జన్నారం మండలంలో గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సూచించిన నిబంధనలను పాటించాలని ఎస్సై గొల్లపల్లి అనూష గురువారం కోరారు. నిమజ్జనం సమయంలో డీజేలు, శబ్ద పరికరాలను వాడకూడదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సందేశాలను నమ్మవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని ఆమె ప్రజలకు సూచించారు.