ఏటీఎం కార్డు మార్చి నగదు డ్రా చేసిన దుండగులు
HNK: కాజీపేట పట్టణ కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి రైల్వే ఉద్యోగిని కల్పనను దుండగులు మోసం చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన సమయంలో దుండగులు ఆమె దృష్టి మళ్లించి ఏటీఎం కార్డు మార్చి తాన ఖాతాలోని రూ. 45 వేలు డ్రా చేశారు. ఘటనపై ఇవాళ ఆమె పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.