లారీ, బస్సు ఢీ.. వ్యక్తికి గాయాలు

లారీ, బస్సు ఢీ.. వ్యక్తికి గాయాలు

కృష్ణా: గన్నవరంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కేసరపల్లి-కంకిపాడు రోడ్డులో ఓ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అలాగే, ఆర్టీసీ బస్సు కూడా పాక్షికంగా దెబ్బతిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.