జమ్మికుంట మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
KNR: జమ్మికుంట మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 602 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,200 ధర పలికింది. గోనె సంచుల్లో 11 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది.