నష్టపరిహారం అందించాలని ఎమ్మార్వోకు వినతి
JN: ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు దేవరుప్పుల తహసీల్దార్ అండాలుకు గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతీ రైతుకు రూ.50 వేల పరిహారం అందించాలని, తడిసిన ధాన్యాన్ని సేకరించాలని కోరారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లలో చోటు కల్పించాలని పేర్కొన్నారు.