మున్సిపల్ ఎన్నికల్లో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ
వికారాబాద్: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద వివిధ వార్డులకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు డప్పు చప్పుళ్లతో, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీలు తీస్తూ నామినేషన్ వేసేందుకు వస్తున్నారు. మొదటిరోజు 12 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. అయితే, వచ్చేనెల 11న ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.