కామ్రేడ్ జక్కల లింగయ్య సేవలు మరువలేనివి: సలీం
NLG: సీపీఎం నాయకుడిగా ప్రజలకు ఎంతో సేవ చేసిన కామ్రేడ్ జక్కల లింగయ్య సేవలు చిరస్మరణీయమని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు MD సలీం అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని 20వ వార్డు సీపీఎం శాఖ ఆధ్వర్యంలో పెద్ద బండ జక్కల పుష్ప భవన్ వద్ద లింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పేదలకు చేసిన సేవలను కొనియాడారు.