VIDEO: విద్యుత్ షాక్‌కు గురైన నలుగురు వ్యక్తులు
కృష్ణా: ఉయ్యూరు శివాలయం సెంటర్‌లో బ్యానర్ కడుతున్న సమయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. బ్యానర్ కడుతుండగా అనూహ్యంగా విద్యుత్ వైరు తగలడం వల్ల నలుగురు వ్యక్తులు ఆదివారం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ సహాయంతో ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.