VIDEO: పోలీసుల ‘జల్లెడ’.. 20 వాహనాలు స్వాధీనం
కాకినాడలోని దుమ్ములపేట, డైరీఫామ్ సెంటర్లలో ఆదివారం పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. నేర నియంత్రణలో భాగంగా డ్రోన్ కెమెరాల సాయంతో ఆకాశం నుంచి నిఘా పెట్టి, అణువణువూ జల్లెడ పట్టారు. సర్పవరం, త్రీటౌన్ సీఐల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.