రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా త్రిశూలయాత్ర

రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా త్రిశూలయాత్ర

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం త్రిశూల యాత్ర ఘనంగా నిర్వహించారు. శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ స్థానాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతున్నందున త్రిశూల యాత్ర కోసం ప్రత్యేక గుండం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.