రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మార్వో

VZM: తెర్లాం మండలంలో చాముండేశ్వరి మోడరన్ రైస్ మిల్, శ్రీలక్ష్మి జగన్నాథ ఆగ్రో రైస్ మిల్, శ్రీ తిరుమల మోడరన్ రైస్ మిల్లులను గురువారం తహసీల్దార్ హేమంత్ కుమార్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ఎటువంటి జాప్యం లేకుండా చేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాక్ సీట్లు వెంటవెంటనే వెంటనే ఎక్నాలజ్ చేయాలని సూచించారు.