చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

KRNL: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్‌‌కు చెందిన ఫొటోగ్రాఫర్ రాజేశ్ శుక్రవారం రాత్రి ఢనాపురం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.