'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'
అనకాపల్లి: నాతవరం జనసేన కార్యాలయంలో శనివారం జనవాణి కార్యక్రమంను నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ప్రజల నుంచి మొత్తం 7 వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, పింఛన్లు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడించారు.