అవుకు మండలంలో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
NDL: అవుకు మండలం చెర్లోపల్లి గ్రామ పొలిమేర వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. అవుకు నుంచి తాడిపత్రి వెళ్తున్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ ఆటోను మలుపు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గాయపడిన వారిని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.