'మండపాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని సర్కిల్ ఇన్ సెక్టర్ ప్రసాద్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. మండపాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాల నిర్వాహకులు పోలీసు సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలను కాపాడే విషయంలో సహకరించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు వేయకూడదని, మండపాల వద్ద DJలకు అనుమతి లేదన్నారు.