పెద్దల సభకు స్టార్ హీరో

తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కీలక ప్రకటన చేసింది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, స్టార్ హీరో కమల్‌హాసన్‌ను రాజ్యసభకు పంపించనున్నట్లు వెల్లడించింది. గతంలో డీఎంకేకు కమల్‌హాసన్ మధ్య ఓ రాజకీయ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను రాష్ట్రం తరఫున పెద్దల సభకు పంపనున్నట్లు తాజాగా ప్రకటించింది. రాజ్యసభకు ఖాళీ అయిన సీట్లకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి.