'యువత క్రీడల్లో రాణించాలి'
JGL: యువత క్రీడల్లో రాణించాలని భీమారం మండలం గోవిందారం గ్రామ సర్పంచ్ ఉమారాణి అన్నారు. గ్రామంలోని వాలీబాల్ జట్టుకు ఆదివారం వాలీబాల్ కిట్‌ను అందజేశారు. క్రీడల్లో రాణించి గ్రామానికి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బింగి స్వామి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.