సీఎంఆర్ఎఫ్ కింద సత్వరమే ఆర్థిక సహాయం అందజేత

సీఎంఆర్ఎఫ్ కింద సత్వరమే ఆర్థిక సహాయం అందజేత

NTR: మైలవరం నియోజకవర్గంలో తాజాగా 59 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.32,33,172 ఆర్థిక సహాయం మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ కింద సత్వరమే ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు.