ఎస్సీ బాలికలకు ఆశ్రమ ఐటీఐ ఏర్పాటు

ఎస్సీ బాలికలకు ఆశ్రమ ఐటీఐ ఏర్పాటు

నెల్లూరు: సంగం మండలంలో ఎస్సీ బాలికల కోసం ప్రత్యేకంగా ఆశ్రమ ఐటీఐ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. తరుణవాయిలోని ల్యాంకో భవనంలో దీనిని నెలకొల్పనున్నారు. మంత్రులు ఆనం, బాలవీరాంజనేయ స్వామి చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ విద్యార్థినులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి ఆర్థికంగా చేయూతనివ్వడమే దీని లక్ష్యం. అధికారులు ఇప్పటికే భవన పరిశీలన పూర్తి చేశారు.