నూతన అడిషనల్ డీఎంఈగా పదోన్నతి నియామకం

NDL: సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లుకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) గా పదోన్నతి లభించింది. ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఆయనకు ఈ పదోన్నతి కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం జీవో జారీ చేశారు. ఆర్థో విభాగంలో సేవలందించిన ఆయన, 2023 అక్టోబర్‌లో ఎఫ్ఎసీగా సూపరింటెండెంట్‌గా చేరి, ఇప్పుడు రెగ్యులర్‌గా కొనసాగనున్నారు.