విజయవాడ రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య
NTR: విజయవాడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో రాము అనే వ్యక్తి, సాయి మెడపై మద్యం సీసాతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన సాయిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.