'పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలి'
తూ.గో: గోకవరం మండలంలో ఉన్న14 గ్రామపంచాయతీల పరిధిలో మిగిలి ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తీసుకోవాలని మండల పౌరసరఫరాల అధికారిణి శాంతిప్రియ సూచించారు. మండలానికి మంజూరైన 5,697 కార్డులను ఆగష్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, డీలర్ల ద్వారా పంపిణి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలన్నారు.